పాము చెప్పెత్తుకు పోయింది... దానికెందుకో!

November 25, 2022


img

పాము కాటు వేస్తుందని తెలుసు కానీ చెప్పులు ఎత్తుకుపోతుందని తెలుసా? ఇండియన్ ఫారెస్ట్ అధికారి ఫర్విన్ కస్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోని చూస్తే నిజమని నమ్మక తప్పదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఓ పాము ఓ ఇంట్లోకి జొరబడేందుకు వస్తుంటే ఆ ఇంట్లో ఉన్న మహిళలు దానిని అదిలించి తరిమేసేందుకు ఆ పాముపై తమ కాలి చెప్పును విసిరారు. అప్పుడు ఆ పాము ఆ చెప్పును నోట కరుచుకొని జరజరా పాక్కొంటూ తుప్పల్లోకి వెళ్లిపోవడం చూసి ఆ మహిళలు నవ్వుకొన్నారు. ఈ వీడియోని చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. 

 Related Post