తెలంగాణాలో ఇక నుంచి వరుసగా ఉపఎన్నికలే: బండి

August 04, 2022


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా నేడు భువనగిరిలో పాదయాత్ర చేస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరుతుండటం గురించి మాట్లాడుతూ, “ఆయన ఒక్కరే కాదు టిఆర్ఎస్‌కు చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్చులో ఉన్నారు. వారు కూడా తమ పదవులకు రాజీనామా చేసి బిజెపిలో చేరనున్నారు. కనుక మునుగోడు ఉపఎన్నికలు ఆరంభం మాత్రమే. మున్ముందు తెలంగాణలో చాలా  అప్పుడు వరుసగా ఉపఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. మునుగోడు ఉపఎన్నికలతో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు రాబోతోంది. 

దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికల తరువాత ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే దిశలో మరో ముందుఅడుగు వేయబోతోంది. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలోచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాము. తాజా సర్వేలో రాష్ట్రంలో బిజెపికి 60-65 సీట్లు రావచ్చని తేలింది. కనుక ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఈసారి గెలిచేది మేమే... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు మోడీ నాయకత్వం మీద నమ్మకమున్న అందరినీ బిజెపిలో చేర్చుకొంటాము కానీ టికెట్ల కోసమే వచ్చే వారిని మాత్రం చేర్చుకోబోము. టికెట్ల విషయం మా పార్టీ అధిష్టానమే చూసుకొంటుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా మా పార్టీలో చేరుతారని నేను విశ్వశిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post