కొత్తగూడెంలో మరో మూడు డయాలసిస్ సెంటర్లు

May 15, 2023
img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందున, వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు ఉన్నవాటికి అదనంగా మరోమూడు డయాలసిస్ సెంటర్లు (రక్తం శుద్ధి చేసే యంత్రాలు) ఏర్పాటు చేయబోతోంది. ముందుగా మణుగూరు ఏరియా హాస్పిటల్, ఇల్లెందు కమ్యూనిటీ హెల్త్ సెంటరులో ఏర్పాటు చేసిన డయాలసిస్ మెషిన్లను బుధవారం నుంచి రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ఆశ్వారావుపేటలో ఏర్పాటు చేస్తున్న మరో డయాలసిస్ సెంటర్ ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది.   

ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 5 డయాలసిస్ మెషిన్లు, భద్రాచలం ఏరియా హాస్పిటల్లో 10 మెషిన్లు, ఉన్నప్పటికీ కిడ్నీ రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో అవి ఏమాత్రం సరిపోవడం లేదు. కనుక ఇప్పుడు ఈ మూడు డయాలసిస్ సెంటర్లు కూడా అందుబాటులోకి వస్తే రోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. నిరుపేద కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ చేసేందుకు కేంద్రాలు ఏర్పాటుచేయడం చాలా అభినందనీయమే. కానీ జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్యా నానాటికీ పెరిగిపోతుండటం చాలా ఆందోళనకరమే.

Related Post