వరంగల్లో 2,000 పడకలతో సిద్దమవుతున్న ప్రభుత్వాసుపత్రి

April 20, 2023
img

ఒకప్పుడు ఉద్యోగాలు, వైద్యం కోసం అందరూ హైదరాబాద్‌కు వెళ్ళవలసివస్తుండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో వైద్య కళాశాలలు, ఐ‌టి పార్కులు, ఐ‌టి హబ్‌లు, పారిశ్రామికవాడలు నెలకొల్పుతూ  స్థానికంగానే ఆ అవకాశాలు కల్పిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

హైదరాబాద్‌తో అన్ని రంగాలలో పోటీ పడుతూ రెండో స్థానంలో నిలుస్తున్న వరంగల్‌ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం 2,000 పడకలతో రాష్ట్రంలోకే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిని నిర్మిస్తోంది. వరంగల్‌ సెంట్రల్ జైలును వేరే చోటికి తరలించి అక్కడ 56 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.1,200 కోట్లు ఖర్చు చేసి 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిని నిర్మిస్తోంది. 

దీనిలో 16 అంతస్తులలో ఆసుపత్రి ఉంటుంది. మిగిలిన 8 అంతస్తులలో వైద్య, నర్సింగ్ తదితర విద్యాసంస్థలకు కేటాయిస్తుంది. దీనికి సిఎం కేసీఆర్‌ 2021, జూన్ 21న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి శరవేగంగా ఈ భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆ ఫోటోలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రజలతో షేర్ చేసుకొన్నారు. ఇవిగో ఆ ఫోటోలు... 

   

 

Related Post