కరోనా టీకా ఇక ఎప్పుడైనా తీసుకోవచ్చు

March 04, 2021
img

ఇక నుంచి ప్రజలు రోజులో ఎప్పుడైనా తమకు వీలున్న సమయంలో సమీపంలోని టీకా కేంద్రాలకు వెళ్ళి టీకా వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రజల ఆరోగ్యం, వారి సమయం విలువను ప్రధాని నరేంద్రమోడీ అర్ధం చేసుకొన్నారని పేర్కొన్నారు. దేశంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం మరింత వేగవంతం కావాలని ప్రధాని నరేంద్రమోడీ కోరుకొంటున్నారన్నారు. కనుక ప్రజలు ఈ వెసులుబాటును ఉపయోగించుకొని కరోనా టీకాలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటి కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, టీకా కేంద్రాలు వాటి సామర్ధ్యం, టీకాల లభ్యతను బట్టి టీకాలు వేసే సమయాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. అయితే కరోనా టీకాల ప్రక్రియకు సంబందించి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను కేంద్రానికి తెలియజేస్తుండాలని సూచించారు.

ప్రస్తుతం రెండో దశలో 60 ఏళ్ళు పైబడినవారికి, దీర్గకాలిక రోగాలతో బాధపతున్నవారికి మాత్రమే ఉచితంగా కరోనా టీకాలు వేస్తున్నారు.

Related Post