మా ప్రేమ-పెళ్ళి చాలా కష్టపడ్డా: కీర్తి సురేశ్

November 05, 2026
img

ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో తన ప్రేమకథ 2010 జనవరిలో మొదలైందని కీర్తి వెల్లడించారు. తాను సినిమాల్లోకి రాకముందే ఆంటోనీ పరిచయమని, ఇద్దరం కలిసి ఎదిగామని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని చెప్పారు. 

అప్పటికి తన వయసు 17 ఏళ్లని, ఆంటోనీ తనకంటే ఏడేళ్లు పెద్దవారని తెలిపారు. ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో ఇంట్లో చాలా సమస్యలు ఎదురయ్యాయని, కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పారు.

అయితే 15 ఏళ్లుగా తమ ప్రేమ అలాగే బలంగా కొనసాగడంతో చివరికి తన తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారని కీర్తి సురేశ్ తెలిపారు.

వారి ఆమోదం లభించడంతో 2024 నవంబర్‌లో దీపావళి సందర్భంగా ఆంటోనీతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నానని, మరుసటి నెలలోనే అంటే డిసెంబర్ 12న గోవాలో వివాహం చేసుకున్నామని చెప్పారు.

పెళ్లి కోసం కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ఇంత కష్టపడినా, చివరికి ఇరు కుటుంబాల పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్నామని, ఇది తనకు ఎంతో గొప్ప అనుభూతిని మిగిల్చిందని కీర్తి సురేశ్ చెప్పారు.

Related Post