అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పేరుతో మొదటి పాట నవంబర్ 7న విడుదల కాబోతోంది. నాగచైతన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా పాటలు విడుదలవుతాయి.
ఈ సినిమాలో నాగచైతన్య ‘అర్జున్’గా కనిపించబోతున్నట్లు తాజా పోస్టర్‌తో చెప్పేశారు. ఈ పాటకు అజనీష్ బి. లోక్‌నాథ్ అద్భుతమైన సంగీతం అందించారని, ఇది తన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని నాగచైతన్య పేర్కొన్నారు.
‘విరూపాక్ష’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, సూపర్ హిట్ హిందీ సినిమా ‘లాపతా లేడీస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమా విలన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ డిసెంబర్ 4వ తేదీన వృషకర్మ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.