జేఈఈ మెయిన్స్ మే సెషన్ పరీక్షలు వాయిదా

May 04, 2021
img

ఈ నెల 24 నుంచి 28వరకు జరుగవలసిన జేఈఈ మెయిన్స్ మే సెషన్ పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు. విద్యార్దుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది www.nta.ac.in వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తామని, కనుక విద్యార్దులు అప్పుడప్పుడు వెబ్‌సైట్‌ను చూస్తుండాల్సిందిగా సూచించారు. మే సెషన్ పరీక్షలు వాయిదా పడినందున ఈ పరీక్షలకు సిద్దమయ్యేందుకు విద్యార్దులకు మరింత సమయం లభించింది కనుక దీనిని సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ విద్యార్దులకు సూచించారు. ఇందుకోసం ఎన్‌టీఏ రూపొందించిన అభ్యాస్ మొబైల్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.  


Related Post