రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘కాంతార’కు సీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ నుంచి బ్రహ్మ కలశ పాట విడుదల చేశారు. కృష్ణ కాంత్ వ్రాసిన ఈ శివుడి భక్తిగీతాన్ని . అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచి సంగీతం అందించగా, అబ్బి వి గంభీరమైన స్వరంతో భక్తిభావం ఉట్టిపడేలా పాడారు.
‘కాంతార: ఛాప్టర్ 1’లో రిషబ్ శెట్టికి జంటగా రుక్మిణీ వసంత్ నటించగా జయరాం, రాకేశ్ పూజారి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీశారు. అక్టోబర్ 2న ‘కాంతార: ఛాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చాలా ఆకట్టుకొని సినిమాపై అంచనాలుపెంచింది. విడుదల చేయబోతున్నారు.
తొలిసారిగా‘కాంతార: ఛాప్టర్ 1’ సినిమాని బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషబ్ శెట్టి; సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్ చేశారు.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/INgfY0aIFfs?si=StYSTd59E76fnvoF" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>