ప్యారడైజ్‌లో మోహన్ బాబు ఫస్ట్ లుక్ టెరిఫిక్!

September 27, 2025


img

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్‌’లో నాని ఫస్ట్ లుక్ పోస్టర్‌, ‘జడల్’ అనే ఆ పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు విడుదల చేసిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా అద్దిరిపోయింది.

చొక్కా లేకుండా రక్తం మరకలు అంటిన చేతిలో సిగార్, మరో చేతిలో పెద్ద కత్తి, తుపాకీ, నల్ల కళ్ళద్దాలతో చాలా స్టయిలిష్‌గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు మోహన్ బాబు విలన్‌గా నటించేవారు. కానీ ఆ తర్వాత హీరో, క్యారెక్టర్ పాత్రలకే పరిమితమయ్యారు.

మళ్ళీ చాలా కాలం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆయనలో విలన్‌ని బయటకు తీసుకువచ్చి చూపించబోతున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర పేరు ‘శికంజ మాలిక్.’ 

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: సాయి, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతోంది. 


Related Post