త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల పల్లి మండలంలోని కేశవాపూర్ గ్రామానికి చెందినా బుట్టెంగారి మాధవరెడ్డి ఈ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.
సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ఇదివరకు హైకోర్టు ఆదేశించింది. మరో మూడు రోజులలో ఆ గడువు ముగిస్తుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఖరారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమం చేసింది. కానీ ఇప్పుడు హైకోర్టులోనే దీనిపై పిటిషన్ దాఖలైంది. కనుక దీనిపై హైకోర్టు తీర్పు వెలువడేవరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ఆలస్యం కావచ్చు.