వెంకటేష్ తో ఆ రీమేక్.. డైరక్టర్ అతనేనా..!

June 11, 2019


img

రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజై హిట్టు కొట్టిన సినిమా దే దే ప్యార్ దే. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, టబు నటించిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అక్కడ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ దే దే ప్యార్ దే సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారట. విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో మళ్లీ టబుని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. రకుల్ ప్రీత్ సింగ్ స్థానంలో ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశాన్ని శ్రీవాస్ కు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన శ్రీవాస్ మొదటిసారి కామెడీ జానర్ చేస్తున్నాడు. వెంకటేష్ తో ఈ రీమేక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.    Related Post

సినిమా స‌మీక్ష