ప్రేమజంట ఒకటైంది..!

March 11, 2019


img

సౌత్ ఇండస్ట్రీలో మరో ప్రేమ జంట ఒక్కటైంది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య హీరోయిన్ సయేషా సైగల్ ను పెళ్లాడాడు. ఇద్దరు కలిసి గజినికాంత్ సినిమాలో నటించారు. ఆ సినిమా టైంలో అభిరుచులు కలవడంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు సైలెంట్ గా సాగించిన వీరి వ్యవహారం మీడియాకు లీక్ అవడంతో ఫిబ్రవరి 14న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆర్య, సయేషా మ్యారేజ్ హైదరాబాద్ లో జరగడం విశేషం.

సయేషాకు సంబందించిన బంధువులందరు హైదరాబాద్ లో ఉండటం వల్ల ఇక్కడే మ్యారేజ్ పెట్టుకున్నారు. కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆర్య ఇన్నాళ్లకు ఓ ఇంటివాడయ్యాడు. శని, ఆదివారం రెండు రోజులు వీరి పెళ్లితంతు జరిగింది. వీరి పెళ్లికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్స్ అటెండ్ అవడం విశేషం. పెళ్లి తర్వాత సయేషా సినిమాలను ఆపేస్తానని ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. Related Post

సినిమా స‌మీక్ష