రాజమౌళికి షాక్ ఇచ్చిన భామలు..!

February 07, 2019


img

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా నడుస్తుండగా ఇంకా హీరోయిన్స్ ఫైనల్ కాకపోవడంపై ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా పరిణితి చోప్రా, అలియా భట్ లను అడిగారట.

తెలుగు సినిమా అనేసరికి వారు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. పరిణితి చోప్రా 4 కోట్ల దాకా అడుగగా.. అలియా భట్ మాత్రం ఏకంగా 6 కోట్లు అడిగేసిందట. అంటే బడ్జెట్ లో ఈ ఇద్దరికి 10 కోట్లు కేటాయించాలన్నమాట. బాలీవుడ్ భామలు అవసరమైతే సినిమాలైనా చేయకుండా ఉంటారేమో కాని సౌత్ సినిమాలకు మాత్రం తక్కువ రెమ్యునరేషన్ తో చెయ్యరు. మరి వీరు అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి వారిని తీసుకుంటారా లేక ఇక్కడ హీరోయిన్స్ తోనే నడిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.   

మన దగ్గర ఉన్న హీరోయిన్స్ తో చేస్తే మహా అయితే ఇద్దరికి చెరో 2 కోట్లు ఇచ్చినా హీరోయిన్స్ కు 4 కోట్లు కంటే ఎక్కువ అవదు. ప్రస్తుతం రాజమౌళి హీరోయిన్స్ ను ఫైనల్ చేసే పనిలోనే ఉన్నాడట. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష