కాజల్ ‘సత్యభామ’ మరోసారి వాయిదా!

May 23, 2024


img

 చందమామ, మగదీర, మిర్చి వంటి సినిమాలలో తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన కాజల్ అగర్వాల్ స్థానంలోకి కొత్త హీరోయిన్లు వచ్చేయడంతో క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి.

మళ్ళీ చాలా కాలం తర్వాత సత్యభామ అనే లేడీ ఓరియంటడ్‌ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో యాక్షన్ చిత్రంగా సిద్దమైన ఈ సినిమా మొదట మే 17న విడుదల కావలసి ఉండగా వాయిదా పది మే 31కి మారింది. కానీ ఇప్పుడూ అనివార్య కారణాల వలన మరోసారి వాయిదా పడి జూన్ 7కి వెళ్ళింది.

ఈ విషయం ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ, “ప్రతీ పాత్ర ఓ ప్రయాణమే, కానీ, సత్యభామ మాత్రం ఓ విప్లవం. ఎవరికైనా న్యాయం చేయడం కేవలం డ్యూటీ మాత్రమే కాదు. అది వాళ్ళకు మనం చేసే ప్రామిస్. జూన్ 7న సత్యభామతో ప్రయాణం చేసేందుకు మీరంతా సిద్దామేనా?” అంటూ సినిమా ఆరోజున రిలీజ్ కాబోతోందని సూచించారు. 

సూపర్ హిట్ ‘మేజర్’ సినిమాకు దర్శకత్వం వహించిన శశికిరణ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి సమర్పకులుగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

సత్యభామ సినిమాకు కధ: రమేశ్ యద్మ, ప్రశాంత్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సింగం మోహిత్ కృష్ణ, ఎడిటింగ్: కోడాటి పవన్ కళ్యాణ్ చేశారు. 

ఏవీ మురళీధర్, బాలాజీ వీర్నాల (అమెరికా) కలిసి ఆరం ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.       

 


Related Post

సినిమా స‌మీక్ష