కన్నప్ప టీజర్‌... అసలు కంటే కొసరే ఎక్కువ?

June 15, 2024
img

పురాణాలలో ‘భక్త కన్నప్ప’ శివ భక్తిని తెలియజేస్తుంది. దానికి కృష్ణంరాజు కాస్త రంగులు, హంగులు అద్ది ‘భక్త కన్నప్ప’ సినిమా తీసి అందరినీ మెప్పించారు. ఇప్పుడు మంచు విష్ణు దానికి మరికాస్త యాక్షన్ కూడా జోడించి ‘కన్నప్ప’గా మన ముందుకు రాబోతున్నాడు. 

కన్నప్ప కధ భక్తి రస ప్రధానమైనది. కానీ కన్నప్ప టీజర్‌ చూస్తే ఏదో హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసినట్లు అనిపిస్తుంది. రామాయణ గాధని ‘ఆదిపురుష్’గా తీసి నవ్వులపాలైన్నట్లు కాకుండా, మంచు విష్ణు కన్నప్పని జాగ్రత్తగానే తీసి ఉంటారని ఆశిద్దాం.

ఈ సినిమాలో అత్యధిక శాతం న్యూజిలాండ్‌లోనే చిత్రీకరించారు. టీజర్‌లో చూపిన అక్కడి దృశ్యాలు, యాక్షన్ సీన్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. 

ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న కన్నప్పలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌ శివుడిగా నటిస్తున్నట్లు టీజర్‌ ఖరారు చేసింది. కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా, ప్రభాస్‌ నందీశ్వరుడుగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నప్పకు జోడీగా బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. 

కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్‌: చిన్న చేస్తున్నారు.  

ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.  


Related Post