రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జనవరి 31న కావాలా పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న వారిరువురికీ బారసాల కార్యక్రమం జరిపారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ముచ్చటగా ఈ వేడుక జరిగింది. వారిలో మగ పిల్లాడికి ‘శివరామ్’, ఆడ పిల్లకి ‘అన్వీరాదేవి’ అని పేర్లు పెట్టినట్లు రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.
ఇద్దరి పేర్లలో దేవుడి పేర్లు ఉండలనుకున్నామని, కొడుకు పేరులో తన తండ్రి చిరంజీవి (శివశంకర్ వరప్రసాద్)లో శివని తీసుకున్నామని తెలిపారు.
రామ్ చరణ్ దంపతులకు 2023లో ఓ కుమార్తె జన్మించగా ఆ పాపకి ‘క్లింకారా’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కవలలు జన్మించడంతో రామ్ చరణ్ దంపతుల ఇల్లు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడితో కళకళలాడుతోంది.