తెల్లవారుజామున బయలుదేరాలా? అయితే స్విగ్గీ ఆర్డర్ పెట్టండి!

February 12, 2026
img

మన దేశంలో స్విగ్గీ, జొమోటో, జెప్టో, ర్యాపిడో, ఊబర్ వంటి అనేక సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. కానీ ప్రజలు వాటిని నూటికి నూరు శాతం వాడుకుని సుఖపడుతున్నారు కూడా. నిజం చెప్పాలంటే నూటొక్క శాతం వాడేసుకుంటున్నారు. ఇందుకు రెండు చక్కటి ఉదాహరణలు...  

యూపీలో ఓ యువతి పక్క వీధిలో కిరాణా కొట్టుకి వచ్చి అవసరమైన వస్తువులు కొనుకుని ఇంటికి తిరిగి బయలుదేరింది. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. వెంటనే బైక్ రైడర్ వచ్చి ఆమెను పికప్ చేసుకొని ఇంటి వద్ద దింపేశాడు. 

“ఈ మాత్రం దూరానికి బైక్ రైడ్ ఎందుకు బుక్ చేసుకున్నావు?” అని ర్యాపిడో డ్రైవర్ అడుగగా, “ఆ వీధి నిండా చాలా కుక్కలు ఉన్నాయి. గట్టిగా మొరుగుతున్నాయి. వాటిని చూసి భయపడి ర్యాపిడో బుక్ చేసుకున్నాను,” అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. ఆమె చెప్పిన ఈ సమస్య చాలా చిన్నదే కావచ్చు కానీ ప్రమాదకరమైనదే కదా? 

ముంబాయికి చెందిన రిషబ్ అగర్వాల్ సోదరి తెల్లవారుజామునే విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. ఆమె  తెల్లవారుజామున 3 గంటలకు అలారం పెట్టుకున్నా మేల్కోలేదు. ముంబాయిలోనే వేరే ప్రాంతంలో నివసిస్తున్న ఆమె సోదరుడు, ఆమెను నిద్ర లేపేందుకు జెప్టోని వాడుకున్నారు.

ఆయన ఐడియా ఫలించింది. క్షణాలలో జెప్టో డెలివరీ బాయ్ ఇంటి తలుపు కొట్టి ఆమెను నిద్ర లేపాడు. ఆ పార్సిల్ తీసుకొని తన సోదరుడు చేసిన పనికి హాయిగా నవ్వుకున్నారు. సకాలంలో విమానాశ్రయం చేరుకొని విమానం క్యాచ్ చేశారు. 

స్విగ్గీ, జొమోటో, జెప్టో, ర్యాపిడో, ఊబర్ వంటి సేవలు ఆ ఆలోచనే వినూత్నం అనుకుంటే, ప్రజలు అంతకంటే వినూత్నంగా ఆలోచిస్తూ వాటిని ఇలా 100కి 101 శాతం వాడేసుకుంటున్నారు. 

Related Post