మహారాష్ట్రలో కొల్హాపూర్‌లో ఓ విషాద ఘటన జరిగింది. నగరంలో ఓ గణేశ్ మండపం వద్ద ఆడుకుంటున్న శ్రావణ్ గవాడే (10) ఏళ్ళ బాలుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సమీపంలో ఉన్న ఇంటికి వెళ్ళి తల్లి ఒడిలో తలపెట్టుకొని ప్రాణాలు విడిచాడు!
అతనిని సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పారు. అంతవరకు కొడుకు స్పృహ తప్పి పడిపోయాడని భావిస్తున్న ఆ తల్లి గుండెలు పగిలే ఏడుస్తుంటే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆ బాలుడు స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఇంకా విషాదం ఏమిటంటే, నాలుగు సంవత్సరాల క్రితమే ఆ బాలుడి చెల్లి అనారోగ్యంతో చనిపోయింది. కనుక కొడుకుపై ఆశలు పెట్టుకున్న ఆ తల్లితండ్రుల వేదనకు అంతే లేదు.
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఇంత చిన్న వయసు పిల్లలకి గుండెపోటు ఎందుకు వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు.