మృత దేహాల కోసం సిగాచి వద్ద బాధిత కుటుంబాలు ధర్నా

July 02, 2025
img

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సోమవారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. కనుక ఫ్యాక్టరీ శిధిలాల కింద వారి మృతదేహాల కోసం గాలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

అయితే వర్షం కారణంగా శిధిలాల తొలగింపు ప్రక్రియ మెల్లగా సాగుతుండటంతో మూడు రోజుల తర్వాత కూడా చనిపోయిన వారి ఆచూకీ తెలియక, మృతదేహాలు లభించక బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. బుధవారం బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ గేటు వద్ద ధర్నా చేశాయి. శిధిలాల తొలగింపు వేగవంతం చేసి తమ ఆత్మీయుల మృత దేహాలను అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాల కోసం ధర్నా చేయవలసి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ ప్రమాదం చనిపోయినవారిని గుర్తించలేనంతగా కాలిపోవడంతో మృతులని గుర్తించేందుకు ఫ్యాక్టరీ ఆవరణ వద్దే వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 11  మృతదేహాలను ఈవిదంగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పటాన్‌చెరు మార్చురీలో మరో 18 మృతదేహాలని ఇంకా గుర్తించాల్సి ఉంది.

Related Post