వారికి సంతాపం తెలిపి ఈయన పోయారే

June 13, 2025
img

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అతను మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, సోనాకొమ్ స్టార్ కంపెనీ ఛైర్మన్‌ సంజయ్ కపూర్! 

నిన్న మద్యాహ్నం జరిగిన విమాన ప్రమాదంపై సంతాపం తెలుపుతూ సంజయ్ కపూర్ సాయంత్రం 5.11 గంటలకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత సుమారు గంటన్నర తర్వాత పోలో గేమ్ ఆడుతూ సంజయ్ కపూర్ గుండెపోటుతో చనిపోయారు. 

సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ 2003 లో పెళ్లి చేసుకున్నారు. వారి మద్య మనస్పర్ధలు రావడంతో 2016 లో విడిపోయారు. ఆ తర్వాత ఆయన మోడల్ ప్రియ సచ్‌దేవ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో నివాసం ఉంటున్నారు. 


Related Post