సమంత చేతికి ఉంగరం.. పక్కన రాజ్ నిడిమోరు!

April 20, 2025
img

సమంత-నాగ చైతన్య విడిపోయిన తర్వాత ఆమె మానసికంగా క్రుంగిపోతున్న సమయంలోనే మయో సైటీస్ అనే చాలా అరుదైన కండరాల వ్యాధి బారిన పడింది. మరోపక్క చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. 

అటువంటి సమయంలో ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరు ఆమెకు అండగా నిలబడి ఎంతగానో ప్రోత్సహించారు. ఆ కారణంగా ఆమె మళ్ళీ ఆత్మ స్థయిర్యం పెంచుకొని రెండు వెబ్ సిరీస్‌ పూర్తి చేశారు.. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. అప్పటి నుంచే వారిరువురూ ప్రేమలో పడ్డారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు కలిసిమెలిసి తిరుగుతుండటం గమనిస్తే అవి నిజమేననిపిస్తుంది. 

సమంత సొంత సినీ నిర్మాణ సంస్థ ట్రాలాలా’ పై నూతన నటీనటులతో ‘శుభం అనే ఓ చిన్న సినిమా నిర్మించారు. అది మే 9న విడుదల కాబోతోంది. కనుక ఈ సందర్భంగా ‘శుభం’ టీమ్‌ని వెంటబెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆమెతో పాటు రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. 

అందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారు తిరుమల వచ్చినప్పుడు సమంత వెలికి ఓ కొత్త ఉంగరం ధగ ధగా మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఎంగేజ్‌మెంట్‌ రింగ్ అయ్యుండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వారిరువురూ శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కనుక వారు త్వరలోనే శుభవార్త చెప్తారేమో? 

Related Post