ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల మోత!

April 14, 2024
img

ముంబైలోని బాంద్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం తెల్లవారుజామున  ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి తుపాకులతో గాలిలో కాల్పులు జరిపి పారిపోయారు.

గతంలో ఇదేవిదంగా కొందరు బాలీవుడ్‌ ప్రముఖులను అండర్ వరల్డ్ మాఫియా గ్యాంగులు బెదిరించి డబ్బు గుంజడం, హత్యలు చేయడం వంటి ఘటనలు జరిగాయి. కనుక సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన ఈ ఘటనతో బాలీవుడ్‌లో అందరూ ఉలిక్కిపడ్డారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఇదివరకు సల్మాన్ ఖాన్‌ను ఫోన్లో చాలాసార్లు బెదిరించింది. దాని హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు అగ్రస్థానంలో ఉందని నిఘా వర్గాలు కూడా హెచ్చరించడంతో, సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించింది. 

సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్దకు చేరుకొని సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. బహుశః లారెన్స్ బిష్ణోయ్ ముఠాయే ఆయనను బెరించేందుకు ఈవిదంగా చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Post