ఆశిష్ విద్యార్ధి మళ్ళీ పెళ్ళి...

May 26, 2023
img

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి అస్సాంకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రూపాలి బారువాను వివాహం చేసుకొన్నారు. కొందరు సన్నిహితుల సమక్షంలో గురువారం వారు కోల్‌కతాలో రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు. ఆశిష్ విద్యార్ధికి ప్రస్తుతం 60 ఏళ్ళు. ఆయన ఇదివరకు థియేటర్‌లో ఆర్టిస్ట్, సినీ నటి, గాయని అయిన రాజోషిని వివాహం చేసుకొన్నారు. కొంతకాలం తర్వాత వారిద్దరికీ మనస్పర్ధాలు రావడంతో విడాకులు తీసుకొన్నారు. ఇప్పుడు వివాహం చేసుకొన్న రూపాలి బారువాకు కోల్‌కతాలో ఫ్యాషన్ డిజైనర్ షాపులున్నాయి.    ఆశిష్ విద్యార్ధి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, ఇంగ్లీష్ తదితర 11 భాషల్లో సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా రైటర్ పద్మభూషణం, రానానాయుడు వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఆయన నటించిన ‘ఖుఫియా’ హిందీ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల కాబోతోంది. 


Related Post