బెంగళూరులో రోడ్డుపై కొట్టుకొన్న స్కూల్ విద్యార్ధినులు

May 18, 2022
img

మగవాళ్ళు కొట్టుకొంటే అది వయొలెన్స్ ఏమైనా జరగవచ్చు. అదే ఆడవాళ్ళు కొట్టుకొంటే దానినో తమాషాగా మాత్రమే జనం చూస్తారు. బెంగళూరులో ఈరోజు ఉదయం బిషాప్ కాట‌న్ గ‌ర్ల్స్ స్కూల్ విద్యార్థినులు మరో స్కూల్ విద్యార్ధినులు నడిరోడ్డు మీద జుట్లు పట్టుకొని కొట్టుకొన్నారు. దారినపోయేవారు వారి ఫైటింగ్‌ను సరదాగా చూస్తూ తమ మొబైల్ ఫోన్‌లలో షూట్ చేశారే తప్ప ఎవరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. దాంతో విద్యార్ధినుల కొట్లాట చాలాసేపు కొనసాగింది. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అందరూ పారిపోయారు. ఒకరిద్దరు విద్యార్ధినులని అదుపులో తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసారు. ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు విద్యార్ధినుల మద్య జరిగిన ఘర్షణ కారణంగా ఈ స్ట్రీట్ ఫైటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.    

Related Post