నిత్యానంద స్వామికి మోక్షం ఎప్పుడో?

May 18, 2022
img

కోర్టు కేసుల భయంతో భారత్‌ నుంచి పారిపోయి ఓ ద్వీపం కొనుగోలు చేసి దానికి కైలాసదేశం అని నామకరణం చేసి పాలిస్తున్న నిత్యానంద స్వామీజీకి పెద్ద కష్టం వచ్చి పడింది. గత ఆరు నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయనకు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే తనకు క్యాన్సర్ సోకలేదని కేవలం జీర్ణ సంబందిత సమస్యలతో బాధ పడుతున్నానని నిత్యానంద స్వామి చెప్పారు. ఆ కారణంగా గత ఆరు నెలలుగా ఆహారం తీసుకోలేక నీరసించిపోయానని, నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదని చెప్పారు. 

ఇటీవల తరచూ నిర్వికల్ప సమాధి(కోమా)లోకి వెళుతున్నానని చేపపారు. ఆరోగ్యం సహకరించినప్పుడు నిత్య పూజలు చేసుకొంటున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులను ఉద్దేశ్యించి అనుగ్రహ సంభాషణలు చేయలేకపోతున్నానని స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కైలాసదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ లేనందున శిష్యులే తనకు సపర్యలు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యంతో భక్తుల ముందుకు వస్తానని నిత్యానంద స్వామీజీ ఫేస్‌బుక్‌లో సెలవిచ్చారు.        

స్వామీజీ భక్తులను, ప్రభుత్వాలను మోసం చేసి పారిపోతే క్యాన్సర్ ఆయన వెంటపడి శిక్షిస్తోందని ఆయన చేతిలో మోసపోయినవారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కేసుల కారణంగా తిరిగి భారత్‌ రాలేరు కనుక ఇక కైలాసదేశం నుంచి నేరుగా కైలాసానికే వెళ్ళిపోతారేమో?

Related Post