నడిరోడ్డుపై కరాటే కళ్యాణి యువకుడితో ఫైటింగ్

May 13, 2022
img

తెలుగు సినీ నటి కరాటే కళ్యాణి గురువారం హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఓ యువకుడిని చితకబాదారు. శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఫ్రాంక్ వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతూ మంచి పేరు సంపాదించుకొన్నాడు. అయితే ఇటీవల అతను మహిళలను కించపరుస్తూ కొన్ని ఫ్రాంక్ వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అవి కరాటే కళ్యాణి దృష్టికి రావడంతో అతనిని నిలదీసేందుకు గురువారం ఎస్‌ఆర్‌ నగర్‌లోని అతని నివాసానికి వెళ్ళారు. 

ఈ సందర్భంగా ఆమె ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపదెబ్బ కొట్టారు. పక్కనే ఉన్న మరో యువకుడు కూడా శ్రీకాంత్‌ను కొట్టాడు. దాంతో శ్రీకాంత్ కూడా తిరగబడి వారిద్దరినీ కొట్టాడు. వారు ముగ్గురూ రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవడం చూసి జనం పోగయ్యారు. జరిగినది తెలుసుకొని వారు కూడా శ్రీకాంత్‌ను చితకబాదారు. దాంతో అతను అతికష్టం మీద వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. 


Related Post