రెండు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

September 17, 2021
img

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నేడు కేంద్రప్రభుత్వానికి లేఖ పంపింది. దానిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మను, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రాను సిఫార్సు చేసింది. 

తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ హిమా కోహ్లీ ఇటీవల బదిలీపై మళ్ళీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళడంతో, జస్టిస్ రాంచంద్రరావు తాత్కాలికంగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. 

ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే గోస్వామిని ఛత్తీస్‌ఘడ్‌ హైకోర్టుకు బదిలీ చేసి, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రాను ఏపీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియమ్ సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు సిఫార్సుకు కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం లాంఛనప్రాయమే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు వీరు ప్రధాన న్యాయమూర్తులుగా రాబోతున్నట్లే.

Related Post