ఉగ్రవాదులకు 14 రోజుల రిమాండ్

September 15, 2021
img

దేశంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు జాన్ మహమ్మద్ అలీ షేక్, ఒసామా, జీషన్ ఖమర్, మహమ్మద్ అబూబకర్, మహమ్మద్ అమీర్ జీవేద్, మూల్ చంద్‌లకు ఢిల్లీ పాటియాలా హైకోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిఘావర్గాల సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు ఈ ఆరుగురు ఉగ్రవాదులను వలపన్ని పట్టుకొన్నారు. 

వీరిలో ఇద్దరు పాకిస్థాన్‌లో విధ్వంసం సృష్టించడంలో శిక్షణ తీసుకోగా, మరో ఇద్దరు బాంబుల తయారీలో పాకిస్థాన్‌లో శిక్షణ పొందారు. ఆలీ షేక్, మూల్ చంద్‌ ఇద్దరూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి సన్నిహిత బందువులని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. 

వీరిలో జాన్ మహమ్మద్ ఆలీ షేక్ ముంబైలో పుట్టి పెరిగి అక్కడే అనేక ఏళ్లుగా టాక్సీ డ్రైవరుగా చేస్తుండటంతో ముంబై నగరంలో ప్రతీ గల్లీ అతనికి బాగా తెలుసు. అతను ముంబైలో సబర్బన్ రైల్వేస్టేషన్‌లలో బాంబు ప్రేలుళ్ళు జరిపేందుకు పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించాడని నిఘా వర్గాలు గుర్తించాయి. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున పలు నగరాలలో బాంబు దాడులు జరిపేందుకు సన్నాహాలు చేసుకొంటుండగా అందరూ పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారి వద్ద నుంచి తుపాకులు, భారీగా ప్రేలుడు సామాను స్వాధీనం చేసుకొన్నారు. నిఘా వర్గాలు వీరిని సకాలంలో గుర్తించి అరెస్ట్ చేయలేకపోయుంటే భారత్‌లో పెద్ద విధ్వంసం, ప్రాణనష్టం జరిగి ఉండేవి.

Related Post