ఒడిశాలో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్... 7.90 కోట్లు స్వాధీనం

March 02, 2021
img

ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్ నుండి ఒడిశా మీదుగా కారులో నకిలీ కరెన్సీని విశాఖపట్నంకు తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.90 కోట్లు విలువగల నకిలీ 500 నోట్ల కట్టాలను స్వాధీనం చేసుకొన్నారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని పోతాంగి పరిధిలో గల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనికీలు చేస్తుండగా నకిలీ కరెన్సీతో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి, వారి వాహనాన్ని, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకొన్నారు. విశాఖలోని ఓ వ్యక్తికి ఆ నకిలీ కరెన్సీని అందజేసేందుకు తీసుకువెళుతునట్లు నిందితులు తెలిపారని కోరాపుట్ ఎస్పీ జి.వరుణ్ తెలిపారు. ప్రస్తుతం ఏపీలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బహుశః ఓటర్లకు పంచిపెట్టేందుకు ఎవరో రాజకీయనాయకుడు నకిలీ కరెన్సీని తెప్పిస్తున్నారా?అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


Related Post