నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

June 21, 2018
img

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ తో సహా ప్రపంచదేశాలలో అనేకచోట్ల పలువురు ప్రముఖులు, ప్రజలు యోగాభ్యాసాలు చేస్తున్నారు. భారత ప్రదాని నరేంద్రమోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో ప్రజలతో కలిసి యోగాసాధనలో పాల్గొన్నారు. అలాగే ఏపి రాజధాని అమరావతిలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు యోగాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక యోగా అంటే టక్కున గుర్తుకు వచ్చే బాబా రాందేవ్ ఈరోజు రాజస్థాన్ లోని కోటాలో తన వేలాదిమంది అనుచరులతో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రతేకంగా యోగాభ్యాసాలు చేయబోతున్నారు. 

మోడీ సర్కార్, బాబా రాందేవ్ యోగాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తీసుకురావడంలో సఫలం అయ్యారు కానీ నేటికీ భారత్ లో యోగాకు అంత ఆధరణ లభించడం లేదనేది చేదు వాస్తవం. పాఠశాల స్థాయి నుంచి విధిగా యోగాభ్యాసం చేయించాలని మోడీ సర్కార్ భావిస్తే, కొన్ని పార్టీలు దానికి మతంరంగు అద్ది రాజకీయం చేసి అడ్డుపడ్డాయి. యోగాభ్యాసం అనేది రోజూ చేయవలసిన కార్యక్రమం కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మాత్రమే అన్ని రాష్ట్రాలలో మొక్కుబడిగా యోగాభ్యాసాలు చేసి చేతులుదులుపుకుంటారు. అది యోగాభ్యాసాల పట్ల రాష్ట్రాల అనాసక్తిని సూచిస్తుంది. ఏదైనా తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు దాని నుంచి కోల్కొనేందుకే యోగాభ్యాసాలు చేయాలనే అపోహ చాలామంది ప్రజలలో ఉంది. ఇటువంటి అపోహలు, మారిన జీవనవిధనల కారణంగా యోగాకు ఆశించినస్థాయిలో ప్రభుత్వ, ప్రజాధారణ లభించడం లేదు. 

Related Post