అంచెలంచెలుగా కిషన్ రెడ్డి విజయ ప్రస్థానం

June 11, 2024


img

తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ ఆర్ఎస్ఎస్‌ నుంచి వచ్చినవారే. ఇద్దరూ బీజేపీ సిద్దాంతాలను మనసావాచా నమ్మి అనుసరిస్తున్నవారే. ఇద్దరూ పార్టీకి అత్యంత నమ్మకస్తులు విధేయులే! కానీ కిషన్ రెడ్డి చల్లగా పారే సెలయేరువంటివారు కాగా బండి సంజయ్‌ సముద్రంలా విరుచుకుపడే స్వభావం ఉన్నవారు. ఇద్దరి తీరు, దారులు వేరైనప్పటికీ వారి విధానం, లక్ష్యం ఒక్కటే. అది బీజేపీ మాత్రమే. కనుకనే ఇద్దరూ నేడు ఇంత అత్యున్నత స్థాయికి ఎదగ గలిగారని చెప్పవచ్చు. 

అయితే బండి సంజయ్‌ రాజకీయ ప్రస్థానంలో ఎదురైనన్ని ఒడిదుడుకులు కిషన్ రెడ్డి ఎదుర్కోకుండానే అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు.         

కిషన్ రెడ్డి ఇదివరకే కేంద్ర సహాయమంత్రిగా, కేంద్రమంత్రిగా తన సమర్ధత నిరూపించుకున్నారు. కనుక మళ్ళీ ఆయనకు కీలకమైన బొగ్గుశాఖ బాధ్యతలు అప్పగించారు. 1977లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, నాలుగు సార్లు రాష్ట్ర అధ్యక్షుడుగా పార్టీకి సేవలందరించారు. 

ప్రత్యక్ష రాజకీయాలలో 2004, 2009,2014 శాసనసభ ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2018లో శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎంపీ ఎన్నికలలో గెలిచి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. మళ్ళీ 2024 లోక్‌సభ ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచి మళ్ళీ కేంద్రమంత్రి పదవి అందుకోగలిగారు.


Related Post