ఏపీ, తెలంగాణాలకు 5 కేంద్ర మంత్రి పదవులు!

June 09, 2024


img

మరికొద్ది సేపటిలో రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే వారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

మోడీ కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోయే వారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఏపీ నుంచి కె.రామ్మోహన్ నాయుడు (టిడిపి), పెమ్మసాని చంద్రశేఖర్ (టిడిపి), శ్రీనివాస వర్మ (బీజేపీ) ఉన్నారు. 

గత ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, ఎస్ జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వనీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్,  జితేంద్ర సింగ్, మన్సుఖ్ మాండవియా, వీరేంద్ర ఖాటిక్, చిరాగ్ పాస్వాన్, గిరిరాజ్ సింగ్‌ తదితరులు నేడు మళ్ళీ కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

కర్ణాటక మాజీ సిఎం హెచ్‌డి కుమారస్వామి తొలిసారిగా కేంద్రమంత్రి పదవి చేపట్టబోతున్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ ఈయననే ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి చివరి నిమిషంలో మొహం చాటేయడంతో ఘోరపరాజయం పాలయ్యారు.


Related Post