బండి సంజయ్‌, కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవులు

June 09, 2024


img

ఈరోజు సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటే ప్రమాణస్వీకారం చేయబోతున్న వారికి ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానాలు అందాయి.

వారిలో తెలంగాణ నుంచి మాజీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. వారిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు.

ఈసారి ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి కూడా భాగస్వామిగా చేరడంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు)లకు కేంద్రమంత్రి పదవులు లభించాయి. 

టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటున్న సమయంలో కేసీఆర్‌ చుట్టూ తిరిగి కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్న కుమారస్వామికి కూడా కేంద్ర మంత్రి కాబోతున్నారు. 

వీరు కాక ఇంతకాలం మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్, నితిన్ గడ్కారీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాధిత్య సిందియా, జితేంద్ర సింగ్‌ తదితరులున్నారు.

నేడు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వీరందరికీ ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం (ఆదివారం మధ్యాహ్నం) తన నివాసంలో తేనీటి విందు ఇస్తున్నారు.


Related Post