పరారీలో ఏపీ వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి… ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

May 23, 2024


img

ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో చాలా అల్లర్లు, విధ్వంసం జరిగాయి. ఏపీలో అధికార వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మరోసారి పల్నాడు జిల్లాలో మాచర్ల నుంచి పోటీ చేశారు.

కానీ ఈసారి ఓడిపోబోతున్నానని ముందే పసిగట్టడంతో తన సోదరుడు రామకృష్ణా రెడ్డితో కలిసి మాచర్ల పట్టణంలో విధ్వంసం సృష్టించారు. మే 13న పోలింగ్‌ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశించి ఈవీఎంని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. 

ఈ రెండు ఘటనలను ఈసీ చాలా తీవ్రంగా పరిగణించి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా ఏపీ డిజిపి హరీష్ కుమార్‌ గుప్తాని ఆదేశించింది. దీంతో పిన్నెల్లి సోదరులిద్దరూ మాచర్ల నుంచి పారిపోయి హైదరాబాద్‌ చేరుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 

ఈసీ ఆదేశం మేరకు ఏపీ పోలీసులు వారి కోసం హైదరాబాద్‌లో కూడా గాలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు ఎక్కడుంటారో పెద్ద రహస్యమేమీ కాదని అందరికీ తెలుసు. కానీ పోలీసులు వారి కోసం వెతుకుతూ కాలక్షేపం చేస్తుంటే, ఈలోగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఏపీ హైకోర్టులో తమ న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌ కోసం లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. 


Related Post