అది రైతులను మోసగించడమేగా: కేటీఆర్‌

May 21, 2024


img

కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న రకం వరికి మాత్రమే రూ.500 బోనస్ ప్రకటించడంపై బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండి పడ్డారు. ఎన్నికల సమయంలో వరికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సన్నరకం వరికి మాత్రమే బోనస్ ప్రకటించింది.

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్ డౌన్‌ మొదలైంది. నిన్నటి వరకు రైతులకు నీళ్ళు, కరెంటూ ఇవ్వకుండా ఏడిపించారు. ఇప్పుడు రైతులు కష్టపడి పండించిన బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనకపోవడంతో అకాల వర్షాలతో చేతికి వచ్చిన ధాన్యం అంతా నీట మునిగి రైతులు నష్టపోయారు.

రైతు భరోసా రూ.15 వేలు, పంట రుణాల మాఫీ రూ.2 లక్షలు ఇస్తామన్నారు. కానీ ఏదీ ఇవ్వలేదు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తవగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజస్వరూపాన్ని బయటపెట్టింది అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.       

కేటీఆర్‌ ఏమన్నారో ఆయన మాటలలోనే...


Related Post