కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ 20 వరకు

May 14, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రెండు నెలలుగా ఢిల్లీ, తిహార్ జైలులో ఉంటున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరో 6 రోజులు అంటే ఈ నెల 20 వరకు  జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగించింది. 

ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది ఆమెపై 8,000 పేజీలతో కూడిన సప్లిమెంటరీ చార్జ్ షీట్ నమోదు చేశామని న్యాయమూర్తికి తెలియజేశారు. దానిపై ఈ నెల 20వ తేదీన విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు. 

రౌస్ అవెన్యూ కోర్టు తన బెయిల్‌ పిటిషన్లనుతిరస్కరించడాన్ని సవాలు చేస్తూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 24వ తేదీన విచారణ జరుపనుంది. 


Related Post