బిఆర్ఎస్ పార్టీకి రాములు నాయక్ గుడ్ బై!

April 19, 2024


img

శాసనసభ ఎన్నికలలోనే ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటమి తర్వాత కూడా ఇంకా తగులుతూనే ఉంది. జిల్లాలోని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ శుక్రవారం బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన 2018 ముందస్తు ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 

2023 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించి మదన్ లాల్‌కు ఇచ్చారు. కానీ ఆయన కాంగ్రెస్‌ అభ్యర్ధి మాలోత్ రాందాస్ చేతిలో ఓడిపోయారు. 

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోవడం, అదే సమయంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బాగా బలపడటంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నేతలు ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. 

ఇటీవలే భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో బిఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయిన్నట్లే!


Related Post