ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్‌!

April 12, 2024


img

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్ట్ అవుతుండగానే, ఏపీలో కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతుండటం విశేషం.  

టిడిపి జాతీయ కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నారా లోకేష్‌ ఫోన్ ట్యాపింగ్‌ అయ్యిందని యాపిల్ కంపెనీ ఈమెయిల్, మెసేజ్ ద్వారా తెలియజేసింది. 

దీనిపై ఆ పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసి తక్షణం సంబధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మార్చి నెలలో కూడా నారా లోకేష్‌ ఫోన్  ట్యాపింగ్‌కు గురైన్నట్లు యాపిల్ కంపెనీ హెచ్చరించిందని మళ్ళీ ఈ నెలలో మరోసారి అటువంటి హెచ్చరికలే వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఏపీ ఇంటలిజన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ వైసీపి కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నారని పిర్యాదు చేశారు. 

కనుక ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో భాద్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కనకమేడల కేంద్ర ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పటికే రాష్ట్ర డిజిపితో సహా మొత్తం 22 మంది పోలీస్ అధికారులు వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.


Related Post