ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఇంటర్ ప్రధమ పరీక్ష వ్రాసేందుకు వెళుతున్న విష్ణు వర్ధన్ (17) అనే విద్యార్ధి గాయపడ్డాడు. నెరడిగొండ మండలంలోని వదూర్ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ గ్రామం నుంచి బైక్‌పై ఇచ్చోడకు బయలుదేరాడు.
ఇచ్చోడ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు విష్ణువర్ధన్ బైక్‌ని నియంత్రించలేక , రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని వెనక నుంచి బలంగా ఢీకొన్నాడు. ఆ ధాటికి విష్ణువర్ధన్ ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది.
వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించారు. విష్ణువర్ధన్‌ని స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రధమ చికిత్స చేశారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విష్ణువర్ధన్ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలియవలసి ఉంది.