సబ్సీడీ గ్యాస్ సిలిండర్లకు జీవో జారీ

February 27, 2024


img

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు మరో హామీని అమలుచేసింది. మహాలక్ష్మి పధకంలో భాగంగా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందించేందుకు నేడు జీవో జారీ చేసింది. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డులు కలిగి గత మూడేళ్ళుగా గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే ఈ పధకానికి అర్హులు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్నవారి సంఖ్య 89.99 లక్షలని అధికారులు గుర్తించారు. వారిలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొన్నవారందరికీ ఈ రాయితీ గ్యాస్ సిలిండర్స్ అందజేస్తుంది. 

మొదటి విడతలో సుమారు 50 లక్షల మందికి ఈ రాయితీ గ్యాస్ సిలిండర్స్ అందజేసేందుకు వీలుగా అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.80 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సొమ్ముని ప్రతీనెల నేరుగా గ్యాస్ డీలర్లకే చెల్లిస్తుంటుంది. గత మూడేళ్ళలో ఏడాదికి సగటున ఎన్ని గ్యాస్ సిలిండర్స్ వాడారో లెక్కగట్టి అన్ని రాయితీ సిలెండర్స్ అందజేయనుంది. 


Related Post