తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రుల సూచన మేరకు సిఎస్ శాంతికుమారి ముందుగా ఇద్దరు ఉన్నతాధికారులను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించగా, ఇంటలిజన్స్ ఐజీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ కొద్ది సేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే వారం పదిరోజులలో మరింతమంది అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలతో దురుసుగా ప్రవర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు తప్పకపోవచ్చు.