తెలంగాణ కొత్త ప్రభుత్వంలో మంత్రులు వారి శాఖలు

December 07, 2023


img

ఈరోజు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో అంగరంగవైభవంగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, 11 మంది మంత్రుల ప్రమాణస్వీకారాలు జరిగాయి. కొద్ది సేపటి క్రితమే మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. ఆ వివరాలు: 

రేవంత్‌ రెడ్డి: ముఖ్యమంత్రి   

భట్టి విక్రమార్క: ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి 

డి.శ్రీధర్ బాబు: ఆర్ధిక మంత్రి 

ఉత్తమ్ కుమార్‌ రెడ్డి: హోమ్ మంత్రి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: మున్సిపల్ శాఖ మంత్రి 

దామోదర రాజనర్సింహ: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: నీటిపారుదల శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు: రోడ్లు భవనాల శాఖ మంత్రి 

జూపల్లి కృష్ణారావు: పౌరసరఫరా శాఖ మంత్రి 

పొన్నం ప్రభాకర్: బీసీ సంక్షేమ శాఖ మంత్రి 

సీతక్క: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి 

కొండా సురేఖ: మహిళా సంక్షేమ శాఖ మంత్రి   

 మంత్రులకు శాఖల కేటాయింపు కార్యక్రమం కూడా పూర్తయినందున ఆనవాయితీ ప్రకారం ముందుగా మంత్రులు తమ తమ ఛాంబర్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వేదపండితుల ఆశీసులు తీసుకొన్న తర్వాత మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కానీ ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.


Related Post