కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముచ్చటపడి వందల కోట్లు ఖర్చు చేసి వాస్తు ప్రకారం కట్టించుకొన్న ప్రగతి భవన్‌లో ఆయన ఎంతగానో అసహ్యించుకొనే రేవంత్ రెడ్డి నివసించబోతున్నారు.
దాని పేరుని ప్రజా భవన్‌గా మార్చి ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలకు, సామాన్య ప్రజలకు కూడా ప్రజా భవన్ తలుపులు తెరిచే ఉంటాయని రేవంత్ రెడ్డి చెప్పారు.
అది మాటలలో కాకుండా అప్పుడే చేతలలో చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేసీఆర్ రక్షణ కోసం ప్రగతి భవన్‌కు బారికేడ్లు ఏర్పాటు చేసి మూడు అంచెల రక్షణ కల్పించన సంగతి తెలిసిందే.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దానిలోకి మారిన తర్వాత వారానికి ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహించి సామాన్య ప్రజలను నేరుగా కాలువబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన ద్వారం వద్ద కూడా భారీ ఇనుప గేట్లు ఉండేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వాటన్నిటినీ సిబ్బంది గ్యాస్ కట్టర్స్ పెట్టి కత్తిరించి తొలగించి వాటన్నిటినీ వాహనాలలో అక్కడి నుంచి తరలిస్తున్నారు. దారిన పోయే నగర ప్రజలు అది చూసి చాలా ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Video Courtesy: Eenadu