సోనియమ్మ అని గౌరవించినందుకు థాంక్స్!

November 28, 2023


img

మరో రెండు గంటల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. కానీ కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు సోనియా గాంధీ రాలేకపోవడంతో ఆమె సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు ఓ సందేశం పంపారు. 

“ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ వద్దకు రాలేకపోయినా నేను మీ అందరి హృదయాలలో ఉన్నాను. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకొంటున్నాను. తెలంగాణ తల్లి కోసం. అమరవీరుల కోసం ఏర్పాటు చేసుకొన్న తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి కలలు నెరవేరాలని కోరుకొంటున్నాను. మేము మీకు నీతి నిజాయితీతో పనిచేసే చక్కటి ప్రభుత్వాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నాము. మీరు మీ కలలను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.  

మీరందరూ నన్ను ‘సోనియమ్మ’ అంటూ తల్లిలా గౌరవిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మీ ఈ ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఎప్పటికీ మీకు అంకితమై ఉంటాను. ఈసారి మీరందరూ మార్పు కోసం గట్టిగా నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయవలసిందిగా అభ్యర్ధిస్తున్నాను,” అని ఆమె ట్వీట్ సారాంశం. 


Related Post