తెలంగాణలో బిఆర్ఎస్, కేంద్రంలో ఎన్డీయే మళ్ళీ

October 03, 2023


img

ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజా సర్వేలో కేంద్రంలో మళ్ళీ బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పింది. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలకు ఎన్డీయే కూటమి 307 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రాబోతోందని, ఇండియా కూటమి 175 సీట్లు మాత్రమే గెలుచుకొని మళ్ళీ ప్రతిపక్ష బెంచీలలో కూర్చోక తప్పదని ‘టైమ్స్ నౌ’ జోస్యం చెప్పింది.      

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలలో బిఆర్ఎస్ పార్టీకి 9-11 సీట్లు, బీజేపీ-2-3 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 3-4 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని తెలిపింది. అంటే ఈసారి బిఆర్ఎస్ పార్టీ మరో రెండు మూడు సీట్లు గెలుచుకోవచ్చు లేదా ఇంచుమించు గత ఫలితాలు పునరావృతం కానున్నాయని భావించవచ్చు. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఇన్ని సీట్లు సాధించడం ఖాయమనుకొంటే, శాసనసభ ఎన్నికలలో కూడా విజయం సాధిస్తుందనే దానర్దం.    

ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలలో వైసీపి 24 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని తెలిపింది. కానీ ప్రముఖ సర్వే సంస్థ ‘ఇండియన్ పోలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్’ ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపి ఒంటరిగా పోటీ, జనసేనతో కలిసి పోటీ చేసినా విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పింది. కానీ బీజేపీని కూడా కలుపుకొని పోటీ చేస్తే వైసీపి విజయం సాధించే అవకాశం ఉందని చెప్పింది.


Related Post