నేడే ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం

March 25, 2023


img

హైదరాబాద్‌ నగరంలో మరో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యింది. ఎల్బీ నగర్‌ వద్ద వనస్థలిపురం-దిల్‌సుఖ్‌నగర్‌లను కలుపుతూ ఎస్ఆర్‌డిపిలో భాగంగా రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభోత్సవం చేస్తారు. మూడు లేన్లలతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ పొడవు: 760 మీటర్లు, వెడల్పు: 12 మీటర్లు. దీంతో ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది. వాహనదారులు సిగ్నల్స్ వద్ద వేచి చూస్తూ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా హాయిగా ముందుకు సాగిపోగలరు. హైదరాబాద్‌-విజయవాడ మద్య నిత్యం ప్రయాణించే వేలాది వాహనాలకు ఈ ఫ్లైఓవర్‌ చాలా ఉపశమనం కలిగిస్తుంది. 

మంత్రి కేటీఆర్‌ గత ఏడాది నవంబర్‌లో ఈ పధకం కింద ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 33 ప్రాజెక్టులు పూర్తి చేశామని, వాటిలో 17 ఫ్లైఓవర్లు ఉన్నాయని తెలియజేస్తూ వాటి ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ జాబితాకు ఇప్పుడు మరో ఫ్లైఓవర్‌ జోడించారు. 


Related Post