ఇక్కడ అన్నిరకాల ప్రశ్నాపత్రాలు లభించును!!!

March 22, 2023


img

టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఉస్మానియా విద్యార్ధి జేఏసీ ఛైర్మన్‌ అర్జున్ బాబు చాలా వినూత్నంగా నిరసన తెలిపాడు. హైదరాబాద్‌ టిఎస్‌పీఎస్సీ కార్యాలయం గోడపై ఈరోజు ఉదయం పోస్టర్స్ ప్రత్యక్షమయ్యాయి. వాటికి ‘టిఎస్‌పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ అని హెడ్డింగ్ పెట్టి “ఇచ్చట అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ ప్రశ్నాపత్రాలు లభించును,” అని ముద్రించాడు. కిందన “తప్పుచేసిన టిఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా కేవలం పరీక్షను రద్దు చేయడం ఏంటి? శిక్ష ఎవరికి బోర్డుకా, విద్యార్థులకా?” అని ప్రశ్నిస్తూ (ఇదీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పనితీరు) అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు.

• ముఖ్యమంత్రిగారూ... మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. 

• ప్రశ్నాపత్రాల లీకేజీలో మీ కుటుంబ సభ్యులా పాత్రలేదని చెప్పడానికి ఈ కేసు దర్యాప్తును వెంటనే సీబీఐకి అప్పగించి, టిఎస్‌పీఎస్సీ బోర్డును మరియు సంబందిత మంత్రిని బర్త్ రఫ్ చేయండి. 

• నష్టపోయిన విద్యార్థులకు ఈ నెల నుంచే నెలకు రూ.10,000 చొప్పున మళ్ళీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి,” అంటూ తన డిమాండ్స్ వ్రాసిపెట్టాడు. 

ఇట్లు మీ అర్జున్ బాబు అంటూ ధైర్యంగా ఆ పోస్టర్లలో తన పేరు, ఫోటో కూడా ముద్రించుకొన్నాడు. 


Related Post