గులాబీ తోటలో కవిత... ఆరెంజ్ ప్యారెట్!

November 30, 2022


img

ఒకరు ముఖ్యమంత్రి కుమార్తె మరొకరు మరో ముఖ్యమంత్రికి స్వయన్నా చెల్లెలు. ఆ ఇద్దరూ గొడవపడితే ఎలా ఉంటుంది? ఓ రేంజ్‌లో ఉంటుంది! అయితే ఇద్దరూ మహిళలే కావడంతో చక్కటి కవితల రూపంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకొన్నారు. ఇంతకీ వారెవరంటారా? ఇంకెవరూ... ఒకరు సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత మరొకరు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల. 

గత రెండుమూడు రోజులుగా వైఎస్ షర్మిల చేస్తున్న హడావుడి అందరూ చూస్తూనే ఉన్నారు. హైకోర్టు ఆంక్షలు విధించినప్పటికీ ఆమె మళ్ళీ కల్వకుంట్ల కవితని టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. దానికి కవిత కూడా అంతే ధీటుగా కవితా రూపంలో చక్కటి సమాధానం ఇచ్చారు. ఎప్పుడూ ఘాటుగా ఉండే రాష్ట్ర రాజకీయాలలో ఇద్దరూ ఈవిదంగా కవితాతత్మకంగా తిట్టుకోవడం చాలా వెరైటీగా ఉంది. వారి కవితాతత్మక విమర్శల గురించి మళ్ళీ చెప్పడం ఎందుకు ఇదిగో మీరే చూడండి.             Related Post