మరో మహానటి కాంత? ట్రైలర్‌ అదుర్స్

November 06, 2025
img

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘కాంత’ ట్రైలర్‌ ఈరోజు విడుదలయ్యింది. ఇదివరకు సావిత్రి జీవితగాధతో ‘మహానటి’తో హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్‌ మళ్ళీ అటువంటి ఈ సినిమా ‘కాంత’తో మరో హిట్ కొట్టబోతున్నట్లు నేడు విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతుంది. అయితే ఈ పీరియాడికల్ సినిమాలో ఆయనే మహా నటుడు అనిపిస్తుంది ట్రైలర్‌ చూస్తే!

ఈ సినిమాలో సముద్రఖని, రానా దగ్గుబాటి, భాగ్యశ్రీ బోర్సే ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: జాను చందర్, కెమెరా: డేనీ సంచేజ్ లోపెజ్, ఎడిటర్: ల్యూవెలిన్ ఆంథనీ గోన్సాల్వెస్, ఆర్ట్ డైరెక్టర్: రామలింగం చేశారు. 

స్పిరిట్ మీడియా, వేఫరర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోం వర్గీస్ కలిసి నిర్మిస్తున్న ‘కాంత’ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.    

Related Post